కలమడుగు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు
నవతెలంగాణ – జన్నారం
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని కలమడుగు జడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్ట రాజమౌళి అన్నారు. గురువారం మండలంలోని కలమడుగు ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ తో పాటు వృక్ష రక్షాబంధన్ నిర్వహించారు.. కుటుంబ బంధాలను పెంపొందించడానికి సోదర భావాన్ని పెంపొందించడానికి రక్షాబంధన్ ఏర్పాటు చేసి విద్యార్థులతో విద్యార్థులకు, చెట్లకు రాఖీలు కట్టించడం జరిగిందన్నారు. కుటుంబ బంగాలను రక్త సంబంధాలను పెంపొందించుకోవడానికి రక్షాబంధన్ చక్కని కార్యక్రమమని విద్యార్థులకు సూచించారు. వృక్ష రక్షాబంధన్ నిర్వహించి ప్రతి ఒక్కరూ చెట్లను రక్షించాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES