Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రోటరీ ఆధ్వర్యంలో బాలసదన్ లో రక్షాబంధన్ కార్యక్రమం

రోటరీ ఆధ్వర్యంలో బాలసదన్ లో రక్షాబంధన్ కార్యక్రమం

- Advertisement -

– సామాజిక సేవకు ముందుకు రావాలి.
– సిడీపీఓ ఎం స్వరూపారాణి
నవతెలంగాణ –  కామారెడ్డి

రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాఖీ పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలసదన్ లో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా సిడిపిఓ ఎం.స్వరూపా రాణి,రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా  డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి  మాట్లాడుతూ రక్షాబంధన్ కార్యక్రమం ఒకరికి ఒకరు రక్ష గా ఉండాలని అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తోటి వారి పట్ల మానవతా దృక్పథాన్ని కలిగి ఉండాలని అన్నారు.

అనంతరం సిడీపీఓ ఎం స్వరూపారాణి మాట్లాడుతూ బాలసదన్ లో రోటరీ క్లబ్  రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సంతోషంగా ఉందని,రక్షాబంధన్ కార్యక్రమం మన దేశంలో ఆడపడుచుల పండగగా రక్షాబంధన్ ను పిలుచుకుంటారని తెలియజేశారు.ఈ సందర్భంగా చిన్నారులకు పరీక్ష అట్టలను, కంపాక్స్ బాక్స్ మరియు పరీక్ష కిట్టు ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు శంకర్, ట్రెజరర్ రమణ కుమార్, రోటరీ మెంబర్స్ బాలరాజు, ధనుంజయ్, నాగభూషణం, దత్తాద్రి రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, బాలసదన్ సూపరిండెంట్ సంగమేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad