రాజ్ బి శెట్టి హీరోగా నటించిన కన్నడ సూపర్ హిట్ మూవీ ‘రక్కసపురదోల్’ను తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘రాక్షస పురం’ టైటిల్‌తో తీసుకొస్తున్నారు నిర్మాత కేఎస్ రామారావు. ఈ చిత్రాన్ని కె.ఎన్. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కె.రవివర్మ నిర్మించారు. రవి సారంగ దర్శకుడు. కె.ఎస్. రామారావు సమర్పణలో ఈ సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై త్వరలో తెలుగులో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కె.ఎస్ రామారావు మీడియాతో మాట్లాడుతూ, ‘నా కెరీర్ డబ్బింగ్ చిత్రంతోనే ప్రారంభమైంది.
కమల్ హాసన్ నటించిన ‘ఎర్రగులాబీలు’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాను. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు కొంత విరామం తర్వాత మళ్లీ మా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ‘రాక్షసపురం’ అనే మూవీని తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నా. ఈ చిత్రాన్ని ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా దర్శకుడు రవి సారంగ అద్భుతంగా రూపొందించాడు. నా స్నేహితుడు రవి వర్మ నిర్మించాడు. ఈ సినిమా చూశాక థ్రిల్ అయ్యాను. ప్రొడ్యూసర్ రవివర్మకు ఫోన్ చేసి నేను ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తానని చెప్పాను. ఈ చిత్రంలో హీరో రాక్షస సంహారం చేస్తుంటాడు. అది ఒక ఊరిలో జరుగుతుంటుంది. అందుకే టైటిల్ రాక్షసపురం అని పెట్టారు. నేను 1986లో చిరంజీవితో ‘రాక్షసుడు’ అనే చిత్రాన్ని రూపొందించాను.
ఆ సినిమా టైటిల్ కొందరికి నెగిటివ్‌గా అనిపించింది. కానీ హీరో చేసేవన్నీ మంచి పనులే, కథ మంచిదే. హీరో విలన్స్‌కు రాక్షసుడు కాబట్టి ఆ టైటిల్ పెట్టాం. ఈ రాక్షసపురంలో కూడా హీరో రాక్షసుల్లాంటి విలన్స్‌ను సంహరిస్తాడు. ఒక డిఫరెంట్ సినిమా కావడంతో ఇప్పుడు ఉన్న ట్రెండ్‌కు నచ్చుతుంది. ఈ నెలాఖరులోనే ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ఈ మూవీని మీరంతా ఆదరించాలని కోరుతున్నా’ అని చెప్పారు. రాజ్ బి శెట్టి, స్వాతిష్ట, అర్చన కొట్టిగె, అనిరుధ్ భట్, బి. సురేఖ, గోపాలకృష్ణ దేశ్ పాండే తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్ – కె.ఎం.ప్రకాష్, డీవోపీ – విలియమ్ డేవిడ్, మ్యూజిక్ – అర్జున్ జన్య, నిర్మాత – కె రవివర్మ,
భిన్న క్రైమ్ థ్రిల్లర్ ‘రాక్షసపురం’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



