Tuesday, December 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'రక్తగీతికలు' నవలావిష్కరణ

‘రక్తగీతికలు’ నవలావిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పంజాబ్‌కు చెందిన మహా రచయిత భారత్‌, పాకిస్తాన్‌ విభజన సందర్భంగా జరిగిన మత విధ్వంసాలను గూర్చి వాస్తవిక సంఘటనల ఆధారాంగా ఒక నవలను రచించారు. దానిని తెలుగులోకి ‘రక్తగీతికలు’ పేరున కర్లపాలెం భాస్కర్‌ రావు తెలుగులోకి అనువాదం చేశారు. ఆ పుస్తకాన్ని బుక్‌ ఫెయిర్‌ పుస్తకావిష్కరణ వేదికపై ప్రసిద్ధ పాత్రికేయులు, రచయిత తెలకపల్లి రవి ఆవిష్కరించారు. కవి, రచయిత నరేశ్‌ కుమార్‌ సూఫీ ఈ పుస్తకాన్ని పరిచయం చేశారు.

నవతెలంగాణ బుకహేౌజ్‌ ఎడిటర్‌ కె.ఆనందాచారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆవిష్కర్త రవి మాట్లాడుతూ ”దేశ విచ్ఛిన్న దశలోనూ మనుషులు కలిసి బతకాలన్న సందేశాన్ని ఇచ్చిన పుస్తకం ఇది. విభజనలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టిన వారి వాస్తవిక సంఘటనలను తీసుకుని గొప్ప నవలగా రచయిత తీర్చిదిద్దారు. నేటి విభజన ఆలోచనలు విరుగుడుగా మనుషులు ఎలా కలిసి ఉండక తప్పదో హృద్యంగా చెప్పిన రచన ఇది….. ” అని అన్నారు. పుస్తక పరిచయం చేస్తూ నరేశ్‌ కుమార్‌, నేటి యువత ఈ పుస్తకాన్ని తప్పక చదవాలని కోరారు. నవతెలంగాణ బుక్‌ హౌజ్‌ గౌరవ సంపాదకులు విజయరావు, అనువాదకుడు కర్లపాలెం భాస్కర్‌ రావు, బుక్‌ ఫెయిర్‌ కార్యదర్శి వాసు, నవతెలంగాణ జీఎం కృష్ణారెడ్డి తదితరులు ఈ ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -