ఇతర రాష్ట్రాల్లోని ప్రజల కోసం తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ప్రజలకోసం మాక్‌డ్రిల్స్
పోలీసులు యాక్షన్‌ప్లాన్ రూపొందించాలి : అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
యుద్ధ వాతావరణం సందర్భంగా ఉత్పన్నమ య్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీస్ అధికా రులు సమగ్రమైన యాక్షన్ ప్లాన్ రూపొందించు కోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆయన ఉన్నతస్థా యి అధికారుల కమిటీతో సమావేశమయ్యారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, డీజీపీ జితేంద ర్, డీజీ ఇంటెలిజెన్స్ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు అవినాష్ మహంతి, సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో జాతీయవాదాన్ని పెంపొందించేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని వర్గాల ప్రజలతో సంఘీభావ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో నిర్వహించిన సంఘీభావ ర్యాలీ సమాజానికి మంచి సంకేతాన్ని ఇచ్చిందని చెప్పారు.
సున్నితమైన అంశాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేసి కట్టడి చేయాలనీ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ మాక్ డ్రిల్ ట్రయల్స్ నిర్వహించా లని చెప్పారు. అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సెలవులు రద్దుచేసి, వారంతా హెడ్‌క్వా ర్టర్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాదులో సైరన్ అలర్ట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలనీ, దానికి అవసరమైన పరికరా లు కొనుగోలు చేయాలని సూచించారు. ఆస్పత్రి భవనాల స్లాబ్‌పైన ఎరుపు రంగుతో ప్లస్ గుర్తును ఏర్పాటు చేసుకోవాలని అన్ని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసినట్టు సీఎస్ వివరించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రజల్ని అప్రమత్తం చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. అన్ని ప్రధాన కేంద్రాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేవైసీ లేకుండా సిమ్ కార్డులు జారీ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES