Monday, November 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా..26న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు

కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా..26న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు

- Advertisement -

హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా
జయప్రదానికి ప్రజా సంఘాల పిలుపు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, విద్యార్థి, యువజన, వృత్తి దారుల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న జిల్లా కేంద్రాల్లో ప్రదర్శన, ధర్నాలను నిర్వహించాలని ప్రజాసం ఘాలు నిర్ణయించాయి. అదే రోజు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిం చనున్నట్టు ఆయా సంఘాల నేతలు వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌ లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాల యంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌, కోశాధికారి వంగూరి రాములు, ఉపాద్యక్షులు ఎస్వీ రమ, జె చంద్రశేఖర్‌, పి శ్రీకాంత్‌, కూరపాటి రమేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బి ప్రసాద్‌, వృత్తి సంఘాల సమన్వయ కమిటి నాయకులు పి ఆశయ్య, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి నాగరాజు, ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య, సీఐటీయూ రాష్ట్ర నాయకులు పి సుధాకర్‌ విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను, హక్కులను హరించేందుకు దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నదని చెప్పారు. తమ లాభాలకు ఆటంకంగా ఉన్న కార్మిక చట్టాలను తక్షణం మార్చాలంటూ మోడీ మెడపై కార్పొరేట్లు కత్తి పెట్టారనీ, అందుకే ఎన్నో పోరాటాల ఫలితంగా సంభవించిన చట్టాలను లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా కేంద్రం తీసుకొచ్చిందని తెలిపారు. ఇది అప్రజాస్వామిక చర్య అని చెప్పారు. ప్రజా, కార్మిక వ్యతిరేకమైన ఈ చర్యను మీడియా పట్టించుకోకపోవటం విచారకరమన్నారు. క్యాజువల్‌, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ విధానాన్ని రద్దు చేయాలి, నియామకాలపై నిషేధాన్ని వెంటనే ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు.

సాగర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ బిల్లు – 2025ను రద్దు చేయాలనీ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలనీ, ఈ పథకం ద్వారా 200 రోజుల పనితోపాటు రోజు కూలీ రూ.700 ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనీ, ఎన్‌ఈపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగం సంస్థలలో ఖాళీగా ఉన్న 65 లక్షల పోస్టులను భర్తీ చేయాలనీ, పాత పెన్షన్‌ పథకాన్ని పునరుద్దరించాలనీ, రిజర్వేషన్లను కాపాడటానికి ప్రయివేటీకరణను ఆపాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు సామాజిక రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు ఈ నేపథ్యంలో 26న జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లో ధర్నాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -