నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవ అవగాహన ర్యాలీని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా విచ్చేసి ప్రారంభించినారు. అంబెడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ఆలూరు మండల కేంద్రంలో..
ఆలూర్ మండల కేంద్రంలో 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆలూర్ తహసీల్దార్ రమేష్ ఆదేశాలతో నా భరత్ – నా ఓటు నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమై మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది, ప్రజలు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హత కలిగిన పౌరుడు తప్పకుండా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.
యువత ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకుని ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.తరువాత ఆలూర్ సర్పంచ్ ముక్కెర విజయ్ మాట్లాడుతూ ఓటు హక్కు ద్వారా మాత్రమే ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచగలరని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని తెలిపారు., ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది అజయ్,శ్రీవాణి, శ్రీజ ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.



