Friday, October 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'పెద్ది' కోసం శ్రీలంక బయల్దేరిన రామ్ చరణ్

‘పెద్ది’ కోసం శ్రీలంక బయల్దేరిన రామ్ చరణ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ శ్రీలంకకు పయనమైంది. కొన్ని రోజుల పాటు అక్కడి అందమైన లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రామ్ చరణ్ ఎయిర్‌పోర్ట్‌కు వెళుతున్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. దీన్ని అత్యంత భారీ హంగులతో నిర్మిస్తున్నారు. ఇటీవల వినాయక చవితి రోజున, ‘పెద్ది’ యూనిట్ మైసూరులో ఓ భారీ పాటను చిత్రీకరించింది. ఏకంగా 1000 మంది డ్యాన్సర్లతో రామ్ చరణ్‌పై చిత్రీకరించిన ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -