Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడిపాటి నరసయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కీర్తిశేషులు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు ఏఎసిసి నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి, హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కీర్తి శేషులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, ఆశయ సాధనలో భాగంగా నేడు సర్వోత్తమ్ రెడ్డి జిల్లాలో ప్రతి ఎన్నికల్లో ఇంటింటికి తిరుగుతూ… తనదైన శైలిలో పేద ప్రజలతో మమేకమై, సమస్యలను తెలుసుకుంటూ, ఎన్నికల్లో, ప్రత్యర్థుల నాయకులను మట్టికరిపిస్తూ, అత్యధిక స్థానాలు గెలుపొందుటలో సీనియర్ జూనియర్ నాయకులను ఏకం చేసి, గెలుపులో నాంది పలికారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనురాధ కిషన్ రావు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోరుకొప్పుల నరేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు ఉప్పుల రాంబాబు యాదవ్, ముత్యాల వెంకన్న, వెంకటయ్య ,సుధాకర్ గౌడ్ పెదబోయిన అజయ్ కుమార్, కొండా రాజు, మాచర్ల అనిల్, తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -