నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల) విద్యార్థులు ఫుట్బాల్ అండర్ 14 లో రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పిడి లింగం తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి నిజామాబాద్ జట్టుకు పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికవ్వడం అభినందనీయమని అన్నారు. బాలుర విభాగంలో ఆకాష్, నితీష్, బాలికల విభాగంలో నిష్మిత, దివ్య, అక్షిత, పోచవ్వ ఎంపికైనట్లు తెలిపారు. నవంబర్ 3 నుండి 5వ తేదీ వరకు వికారాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయిలో పాల్గొనున్నట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు వేణుమాధవ్ విద్యార్థులను అభినందించి రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభను కనబరిచి, జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. అభినందించిన వారిలో ఉపాధ్యాయులు, గ్రామస్తులతో పాటు, తోటి విద్యార్థులు తదితరులు ఉన్నారు.
రాష్ట్రస్థాయి ఫుట్బాల్ కు రామారెడ్డి విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



