- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మాతా రమాబాయి అంబెడ్కర్ 128వ జయంతి సందర్భంగా శనివారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కేశారపు నరేశ్ మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా రమాబాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రమాబాయి దేశానికి చెసిన సేవ గొప్పదని కొనియాడారు. ఆమె లేకపోతే అంబెడ్కర్ విద్య ప్రయాణం, సామాజిక పోరాటం, రాజ్యాంగవనిర్మాణం ఆగేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యుడు ఇందారపు చెంద్రయ్య, బొబ్బిలి నరేశ్, మంత్రి రాజా సమ్మయ్య, సత్యనారాయణ, సమ్మయ్య పాల్గొన్నారు.
- Advertisement -



