– ఇఫ్తార్ విందులో మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ – కాటారం
మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కాటారం మండల కేంద్రం లో ఎల్ జీ గార్డెన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రంజాన్ మాసం ప్రేమ, శాంతి, సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ముస్లిం సోదరులు నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు పాటిస్తూ భక్తి, నియమ నిష్ఠలతో ప్రార్థనలు చేయడం గొప్ప సంప్రదాయమని పేర్కొన్నారు.
మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును ముస్లిం సోదరులు శాలువాతో సత్కరించారు
సోదరభావానికి నిదర్శనం.. రంజాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


