Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఅశ్వారావుపేట తహశీల్దార్ గా రామక్రిష్ణ

అశ్వారావుపేట తహశీల్దార్ గా రామక్రిష్ణ

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట పూర్తి అదనపు బాధ్యతల తహశీల్దార్ గా సీ హెచ్.వి.రామక్రిష్ణ సోమవారం విధుల్లో చేరారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఇక్కడ తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ ను సుజాత నగర్ కు బదిలీ చేసారు. జయశంకర్ భూపాలపల్లి నుండి భద్రాద్రి కొత్తగూడెం బదిలీ పై వచ్చిన ఎల్.వీరభద్రం ను అశ్వారావుపేటకు కేటాయించారు. అయితే ఆయన అశ్వారావుపేట రావడానికి విముఖత చూపడంతో అశ్వారావుపేట డీటీ గా విధులు నిర్వహిస్తున్న పీహెచ్.వి.రామక్రిష్ణ ను అశ్వారావుపేట ఇంచార్జి తహశీల్దార్ గా నియమించారు. దీంతో ఆయన సోమవారం విధులు స్వీకరించారు.ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన రామక్రిష్ణ 2005 లో రెవిన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం పొంది వెంకటాపురం మండలంలో పనిచేసారు.ఖమ్మం కలెక్టరేట్ లో, కొత్తగూడెం,పాల్వంచ ఆర్డీఓ కార్యాలయాల్లోనూ,చింతకాని,వేంసూరు,దమ్మపేట,చర్ల మండలాల్లో వివిధ విభాగాల్లో పనిచేసారు.డీటీ గా దీర్ఘకాలం అనుభవం ఉంది.గత రెండేండ్లు గా అశ్వారావుపేటలో డీటీగా విధులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad