– ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా కే.రామకృష్ణారావు నియమితులయ్యా రు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆమె స్థానంలో ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్న రామకృష్ణరావును కొత్త సీఎస్‌గా సర్కార్ నియమించింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆయన ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఆగస్టులో ఆయన పదవి కాలం ముగియనుంది. ప్రస్తుతమున్న ఐఏఎస్‌ల్లో శశాంక్ గోయల్ తరువాత రాష్ట్ర సీనియర్‌గా ఉన్నారు. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం, కేంద్ర నుంచి నిధులు రాబట్టడంలో ఈయన కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అవసరాల నేపథ్యంలో ఆయన్ని ప్రభుత్వం సీఎస్‌గా నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయన పదవి కాలాన్ని రెండేండ్లు పొడిగించే అవకాశముందని భావిస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సీఎస్‌తో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు భాద్యతలు నిర్వహిస్తారు.
ఆర్థిక నిపుణునిగా సుదీర్ఘ అనుభం..
1991 (ఐఏఎస్) బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావు తెలంగాణ కేడర్‌కు చెందినవారు. ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్, మాస్టర్స్ డిగ్రీలను పొందారు. ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పట్టా పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్లగొండ జాయింట్ కలెక్టర్‌గా, ఆదిలాబాద్, గుంటూరు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు. విద్య శాఖ కమిషనర్‌గా, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదిర్శగా వివిధ హోదాల్లో పని చేశారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్‌గా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఆయనది అందె వేసిన చేయి. తెలంగాణ శాసన సభలో ప్రవేశ పెటిన 14 బడ్జెట్లను తయారు చేయడంలో ముఖ్య భూమిక పోషించారు. దేశంలోని ఏ ఐఏఎస్ అధికారి ఇన్ని సార్లు బడ్జెట్‌ను రూపొందించిన దాఖలాలు లేవని తెలుస్తోంది. ఇందులో 12 పూర్తి స్థాయి బడ్జెట్లు కాగా రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు ఉన్నాయి
నూతన సీఎస్‌గారామకృష్ణారావు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES