నవతెలంగాణ – పెద్దవూర
చేయి చేయి కలుపుదాం..నిరుపేద అమ్మాయి పెళ్లికి సాయం అందిద్దాం అంటూ రామావత్ వినోద్ కుమార్ తనవంతు నూతన పెళ్లి కూతురు రూ.5 వేల ఆర్థిక సహాయం అందించి మండల ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. పెద్దవూర మండలం నాయిన వానికుంట తండా కు చెందిన రమావత్ నాగు -శాంత-దంపతులకు ముగ్గురు కూతుళ్లు,ఒక కుమారుడు ఉన్నారు.కూలి పనులు చేసుకుని తల్లిదండ్రులు పిల్లలను చదివించారు. రెండవ కూతురు నందిని ఈనెల 04 న ఆదివారం నాయిన వాని కుంట తండాలో రీసెప్షన్ జరిగింది. అయితే పెళ్లి ఖర్చులకు తల్లిదండ్రుల దీనస్థితి తెలుసుకొని గ్రామానికి చెందిన గ్రామ యువ నాయకులు, కాబోయే సర్పంచ్ రమావత్ వినోద్, మానవత దృక్పధం తో ముందుకు వచ్చి పేదింటి ఆడబిడ్డకు 5016 లు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు.
మానవత్వం చాటుకున్న రమావత్ వినోద్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES