Friday, July 4, 2025
E-PAPER
Homeసినిమాఅత్యద్భుతంగా 'రామాయణ : ది ఇంట్రడక్షన్‌'

అత్యద్భుతంగా ‘రామాయణ : ది ఇంట్రడక్షన్‌’

- Advertisement -

5000 సంవత్సరాల క్రితం జరిగిన గొప్ప ఇతిహాసం కోట్లాది మంది భక్తికి ప్రతీకగా నమిత్‌ మల్హోత్రా రెండు భాగాల ‘రామాయణ’ నిలవనుంది. ఈ చిత్రం హాలీవుడ్‌, భారతదేశానికి చెందిన ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని గొప్ప సినిమాటిక్‌ ఎక్స్‌ పీరియన్స్‌ని అందించబోతోంది అని మేకర్స్‌ అన్నారు.
నితేశ్‌ తివారీ దర్శకత్వంలో నమిత్‌ మల్హోత్రా ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌, 8 సార్లు ఆస్కార్‌ అందుకున్న వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియో డిఎన్‌ఇజీ సంయుక్తంగా, యష్‌ మాస్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పార్ట్‌ 1 వచ్చే ఏడాది దీపావళికి. 2027 దీపావళికి పార్ట్‌ 2ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
‘రామయణ: ది ఇంట్రడక్షన్‌’ చిత్ర గ్లింప్స్‌ని గురువారం ఆవిష్కరించారు. ఈ లాంచ్‌ భారతదేశంలోని తొమ్మిది ప్రధాన నగరాలలో ఫ్యాన్‌ స్క్రీనింగ్స్‌ ద్వారా, అలాగే న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో భారీ బిల్బోర్డ్‌ టేకోవర్‌ ద్వారా వరల్డ్‌ వైడ్‌గా జరిగింది. రణబీర్‌ కపూర్‌ రాముడిగా, యష్‌ రావణుడిగా, సాయి పల్లవి సీతగా, హనుమంతుడిగా సన్నీ డియోల్‌, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. ఈ శక్తివంతమైన తారాగణానికి తోడుగా, అద్భుతమైన సాంకేతిక బందం మద్దతిస్తోంది. తొలిసారి ఆస్కార్‌ అవార్డు విజేతలు హాన్స్‌ జిమ్మర్‌, ఏ.ఆర్‌. రెహ్మాన్‌ కలిసి సంగీతం అందిస్తున్నారు.
నిర్మాత, దర్శకుడు నమిత్‌ మల్హోత్రా మాట్లాడుతూ, ‘ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికీ సంబంధించిన ఒక సాంస్కతిక ఉద్యమం. రామాయణం ద్వారా మేము కేవలం చరిత్రను తిరిగి చెబుతున్నట్లు కాదు. మన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ప్రపంచ స్థాయి ప్రతిభను ఒకచోట కలిపి, ఈ కథను నిజమైన భావోద్వేగంతో, నూతనమైన సినిమాటిక్‌ టెక్నాలజీతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు రామాయణాన్ని ఎన్నోసార్లు చూశాం. కానీ ఈ వెర్షన్‌లో దాని దశ్యాలు, యుద్ధాలు అన్నీ నిజమైన వైభవం, విస్తతతతో ఆవిష్కరించాం’ అని తెలిపారు. ‘రామాయణం అనేది మనందరం చిన్ననాటి నుంచి విన్న, చూసిన కథ. ఇది మన సంస్కతికి ఆత్మవంటిది. ఆ ఆత్మను గౌరవించడమే మా లక్ష్యం. అదే సమయంలో ఈ కథకు అర్హమైన సినిమాటిక్‌ స్థాయిలో ప్రజెంట్‌ చేయాలనుకున్నాం. ఒక దర్శకుడిగా ఇది నా కోసం ఒక భారీ బాధ్యత మాత్రమే కాదు. ఓ గౌరవప్రదమైన అవకాశం కూడా. ప్రపంచంలోని అత్యంత విశేష అనుభూతిని ఇచ్చే ఫార్మాట్లలో ప్రేక్షకులను అద్వితీయమైన థియేట్రికల్‌ అనుభవంలోకి తీసుకెళ్లేలా దీన్ని తెరకెక్కిస్తున్నాం’ అని దర్శకుడు నితేశ్‌ తివారీ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -