- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం తుది దశకు చేరుకుంది. జూన్ 5వ తేదీ నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా, జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో రామ్‌దర్బార్ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
- Advertisement -