Monday, February 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం9న రమెసన్‌ స్మారక ఉపన్యాసం

9న రమెసన్‌ స్మారక ఉపన్యాసం

- Advertisement -

– పుస్తకాన్ని ఆవిష్కరించనున్న రామచంద్రమూర్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌.రమెసన్‌ స్మారకోపన్యాసం, పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగనున్నది. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లోని స్టేట్‌ మ్యూజియంలో భగవాన్‌ మహావీర్‌ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దివంగత డాక్టర్‌ ఎన్‌.రమెసన్‌ జ్ఞాపకాల పేరుతో ఆయన జీవితాన్ని స్మరించుకోనున్నారు. పురావస్తు శాఖకు ఆయన అందించిన సేవలను, వారసత్వ సంపదను పరిరక్షించే క్రమంలో ఆయన పాత్రను నేటి తరాలకు తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్య, వృత్తిలో సాధించిన విజయాలు, పురావస్తు పరిశోధనకు అందించిన సేవల్లో భాగంగా ఉంటాయి. కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. స్మారక పుస్తకాన్ని ఆర్కియాలజీ పూర్వ సంచాలకులు, ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌.ఎస్‌.రామచంద్రమూర్తి ఆవిష్కరించనున్నారు. ఆయన కీలకోపన్యాసం చేస్తారు. పురావస్తుశాఖ సంచాచలకులు ప్రొఫెసర్‌ అర్జున్‌రావు కుత్తడి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. పురావస్తు పరిశోధనకు, వారసత్వ సంపద పరిరక్షణకు కృషి చేసిన వ్యక్తులను గౌరవించుకునే పరంపరలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు కుత్తడి తెలిపారు.
1914లో ఏర్పాటైన పురావస్తుశాఖ పరిశోధనలు, సంభాషణలు తదితర రూపాల్లో ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమం ద్వారా పరిశోధకులు, చరిత్రకారులు, విద్యార్థులు, సాంస్కృతిక ఆసక్తిపరులు కలుసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పురావస్తు, వారసత్వ అంశాల పట్ల ఆసక్తి కలిగిన వారంతా పాల్గొనాలని డైరెక్టర్‌ ఆహ్వానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -