- – వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు కే వెంకట్….
- నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
- జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో మరియు బ్యాంకుల యందు వెంటనే ర్యాంపు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కేంద్రంలో 1000 గజాల స్థలంలో వికలాంగుల భవనాన్ని నిర్మించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కే వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఎన్ పి ఆర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన అనంతరం కలెక్టరేట్ పరిపాలన అధికారి జగన్మోహన్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు స్వరూపంగా ప్రకాష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు కే వెంకట్ హాజరై, మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు వికలాంగులకు అనుకూలంగా లేవని ఆపిడి ఆక్ట్ -2016 ప్రకారం వాటిని అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని అన్నారు ఎన్నికల అప్పుడు మాత్రమే వారికి అవసరం ఉన్న చోట ర్యాంపులు ఏర్పాటు చేసి ఓట్లు దండుకోవడం తప్ప సాధారణ సమయాల్లో వికలాంగులు అనుకూలంగా ఆఫీస్ ఉపయోగించుకోవడానికి అవకాశం లేదని వెంటనే డ్రాప్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో వికలాంగులు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కోసం వెయ్యి గజాలలో వికలాంగుల సామాజిక భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అందులలిపి నిర్మాత లూయిస్ బ్రెయిలీ, హెలెన్ కిల్లర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు.
జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం ఉపేందర్ మాట్లాడుతూ జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం వెంటనే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేయడం. లేనియెడల పెద్ద ఎత్తున వికలాంగులను సమీకరించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ తో సంప్రదించి సమావేశం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఏవో హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమములో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు బాబు, జిల్లా సహాయ కార్యదర్శులు పిట్ట శ్యామ్ సుందర్, శివయ్య జిల్లా నాయకులు పాండాలు శ్రీహరి,బానోత్ లింగ్య నాయక్ , బానోత్ రావోజి నాయక్, నరేష్, సావిత్రి బోయపల్లి యాదగిరి, వి మంజుల, వెంకటేశం, నాగ నరసింహ లు పాల్గొన్నారు.