Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాంప్రసాద్

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాంప్రసాద్

- Advertisement -

– అభినందనలు తెలిపిన తోటి ప్రధానోపాధ్యాయులు 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చౌడారపు రాంప్రసాద్  నిజామాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక అయ్యారు. గత రెండు సంవత్సరాల క్రితం కోనాపూర్ పాఠశాలకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా  పదోన్నతిపై వచ్చి పాఠశాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాలలో వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ వారి సహకారంతో రూ.లక్ష ఇరవై వేలతో విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు వాటర్ ఫిల్టర్, కూలర్ ఏర్పాటు చేయించారు.

150 ఆర్టికల్స్ తో పాఠశాలలో గణిత ప్రయోగశాల ఏర్పాటు, పదో తరగతి విద్యార్థులకు గణిత స్టడీ మెటీరియల్ పంపిణీ, సూత్రాల కార్డుల పంపిణీ, సూత్రాల ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధించారు. గత రెండు సంవత్సరాలుగా గణిత సెమినార్ లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన  రాంప్రసాద్ ను మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య, నోడల్ అధికారి గంగాధర్, ప్రధానోపాధ్యాయులు మధుపాల్, రాజన్న, అరుణ శ్రీ, సాయన్న, వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, మండల విద్యాశాఖ సిబ్బంది అభినందించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad