Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుజిల్లా ఉత్తమ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయునిగా అవార్డు అందుకున్న రాంప్రసాద్

జిల్లా ఉత్తమ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయునిగా అవార్డు అందుకున్న రాంప్రసాద్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలం కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చౌడారపు రాంప్రసాద్  నిజామాబాద్ జిల్లా ఉత్తమ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయునిగా మంగళవారం అవార్డును అందుకున్నారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ  కార్యక్రమంలో జిల్లా ఉత్తమ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయునిగా చౌడారపు రాంప్రసాద్ అవార్డు స్వీకరించారు.నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ అంకిత్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి సమక్షంలో జిల్లా ఉత్తమ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు అవార్డును కోనాపూర్ ప్రధానోపాధ్యాయుడు చౌడారపు రాంప్రసాద్ అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయనను శాలువా పూలమాలతో సత్కరించి, జ్ఞాపిక ప్రశంస పత్రాన్ని అందించారు.జిల్లా ఉత్తమ గ్రిజిటర్ ప్రధానోపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న రాంప్రసాద్ ను నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అభినందించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad