నవతెలంగాణ – గోవిందరావుపేట
రాంపూర్ గ్రామప్రజలు సన్నద్ధం ఈనెల13 న ఉత్తరాభాద్ర నక్షత్ర యుక్త బహుళ పంచమి బుధవారం (ఆశ్లేష కార్తె రెండవ పాదం) శుభదినంగా పరిశీలించి జరుప తలపెట్టినట్లు రాంపూర్ గ్రామ ముత్యాలమ్మ తల్లి ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు. సోమవారం ఉత్సవ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ,రాంపూర్ గ్రామ ప్రజానీకానికి సంబంధించినటువంటి అభ్యుదయ కాలనీలో ఉన్నటువంటి ముత్యాలమ్మ అమ్మ గుడిలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించుటకు ఆయా ప్రజలు సర్వసన్నద్ధం చేసుకుని ఎప్పటి మాదిరిగానే ఆనవాయితీ ప్రకారంగా 13వ తారీకు బుధవారం ఉదయం పూట విశ్వబ్రాహ్మణులు అమ్మవారికి శుద్ధోదకస్నానం, వస్త్రాభరణములు అలంకరణ చేసి ధూపదీప నైవేద్యములు సమర్పించెదరు. అదేరోజు సాయంత్రం గ్రామస్తులందరూ వారి వారి గృహముల నుండి సత్ సాంప్రదాయ బద్దంగా సంపూర్ణ అలంకరణలతో భోణములను ఎత్తుకొని అమ్మవారికి సమర్పించగలరని సవినయముగా మనవి చేస్తున్నాము అందరూ సహకరించాలని కోరారు.
రాంపూర్ బోణాల పండుగ ఉత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES