Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యేను కలిసిన రాంపూర్ వీడీసీ బృందం

ఎమ్మెల్యేను కలిసిన రాంపూర్ వీడీసీ బృందం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
మండలంలోని రాంపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ  సభ్యులు మంగళవారం అంకాపూర్ లో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డిని కలవడం జరిగింది. రాంపూర్ చెరువు కట్ట మీదుగా మంథని రంగనాయకుల గుట్ట వరకు బీటీ రోడ్డు, మిర్ధపల్లి ఆలూరు మీదుగా మరొక లింక్ రోడ్డు ,గ్రామంలో ప్రధాన కూడలి వద్ద ఐమాక్స్  లైట్లు మంజూరు చేయాలనికి ఎమ్మెల్యే ను కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాంపూర్ మీదుగా డబుల్ లైన్ రోడ్డు మంజూరు అయింది అని మిగిలిన రోడ్లు కూడా అతి త్వరలో మంజూరు చేయిస్తాను అని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో వీడిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని అంకాపూర్ గ్రామంలో రేషన్ షాపును ఎమ్మెల్యే పరిశీలించి తగు సూచనలు చేసినారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -