- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నల్గొండలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే దామన్న వల్లే అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎస్సారెస్పీ-2కి ఆర్‌డీఆర్(రాంరెడ్డి దామోదర్ రెడ్డి )అని నామకరణం చేస్తామన్నారు. దీనిపై 24 గంటల్లో జీవో తెస్తామని చెప్పారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘‘నల్గొండ జిల్లాలో పార్టీని దామన్న నిలబెట్టారు. ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్సారెస్పీ ప్రాజెక్టు తెచ్చారు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా ప్రజల కోసం ఆయన పనిచేశారు’’ అని తెలిపారు.
- Advertisement -