పట్టు వస్త్రాలు తలంబ్రాలు అందజేసిన ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
నవతెలంగాణ – తుంగతుర్తి
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ పట్టాభి సీతా రామచంద్రస్వామి ఆలయంతో పాటు, మండల పరిధిలోని పలు గ్రామాలలో శుక్రవారం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారామ లక్ష్మణ విగ్రహాలను ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, పూలతో అలంకరించి, వేద పండితులైన కాటూరి రామాచార్యులు, శంకరమంచి శేషు శర్మ, రామలక్ష్మణులు వేదమంత్రాల మధ్య కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలు పట్టు వస్త్రాలను ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అందజేశారు. కరివిరాల గ్రామంలో స్థానిక సర్పంచ్ మోర సంధ్య బిక్షం తలంబ్రాలు పట్టు వస్త్రాలను అందజేశారు. అన్నారం గ్రామంలో కళ్యాణానికి పట్టు వస్త్రాలు తలంబ్రాలను తీపి రెడ్డి రాంరెడ్డి, బందు నవీన్ అందజేశారు. వాసుదేవ రెడ్డి ప్రణీత రెడ్డి అన్నారం గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ ఎనగందుల సంజీవ, తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, సంకినేని గోవర్ధన్ రావు, ఈగ లక్ష్మయ్య, చెర్విరాల మల్లయ్య, కోల వెంకట్రామ నరసయ్య, పెండెం రామ్మూర్తి, కొండ రాజు, పులుసు సోమయ్య, బందు కృష్ణ, బందు సోమయ్య, ఆయా గ్రామాల పాలకవర్గ సభ్యులు, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.



