Saturday, March 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చండూరులో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు

చండూరులో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ -చండూరు
చండూరు మున్సిపాలిటీ లోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మత గురువు ముజాహిద్ మాట్లాడుతూ దివ్య ఖురాన్ ముస్లింల పవిత్ర గ్రంథం అని ఈ మాసంలో ఆవిర్భవించిందని అన్నారు. ఈ రంజాన్ పండుగ సమస్త మానవాళికి శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ , మత సామరస్యానికి ప్రతీక అని ,క్రమశిక్షణ, దాతృత్వం, ధర్మనిబద్ధత, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పండుగ అని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు , వైస్ ఛైర్మన్ దశరథ జిల్లా నాయకులు మాజి సర్పంచ్ కోడి గిరిబాబు , కోడి వెంకన్న కౌన్సిలర్లు కటకం రమేశ్,వాసు,మల్లేష్,కమ్రుద్దీన్, కరెంటు షరీఫ్ ,యం.డి.నిరంజన్ అలీ (లైన్ఇన్ స్పెక్టర్), జావిద్, జిన్నా, లతీఫ్ పాష, షజ్జు పాష, ఎజాస్,ఖలీల్, రహీం బాబా,హైమద్, సాదక్, జన్ను , వహీద్, చాంద్ పాష, యూనస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -