నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని ఇస్సపల్లి గ్రామంలో ఈద్-ఉల్-ఫితర్ సంబరాలు శనివారం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు కూరపాటి అరుణ జ్యోతి, ఎస్సీ జిల్లా ప్రెసిడెంట్ కమలమ్మ ఎస్సీ జిల్లా జనరల్ సెక్రెటరీ స్నేహ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మండల అధ్యక్షుడు మైనార్టీ మండల అధ్యక్షుడు మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని నిజామాబాద్ రోడ్డు వద్ద గల ఈదుగా యందు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల రోజుల పాటు అత్యంత నిష్టతో, క్రమశిక్షణతో ఉపవాస దీక్షలు ముగించుకుని జరుపుకునే ఈ పండుగ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు.తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు పంచిపెట్టే ‘జకాత్’ మానవత్వాన్ని చాటిచెబుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమని, అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో కలిసిమెలసి పండుగలు జరుపుకోవడం మన విశిష్టత అని గుర్తుచేశారు.
అల్లాహ్ దీవెనలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ, అందరికీ “ఈద్ ముబారక్” తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కర్ కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్ , మునిసిపల్ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, పట్టణ కౌన్సిలర్ భారత్ గ్యాస్ సుమన్ ,కోడిగేలా మల్లయ్య ,సృజన ,భుపెందర్ ,శాల ప్రసాద్ ,నాగేంద్ర ,దామోదర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉప అధ్యక్షులు గదారి గోపీ ,జిల్లా కాంగ్రెస్ పార్టీ స్ఫోక్ పర్సన్ కొంతం మురళి గారు,కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్,చిట్టి రెడ్డి ,రవికాంత్ రెడ్డి ,మాజి కౌన్సిలర్ ఆకుల రాము తదితరులు పాల్గొన్నారు.



