డిఎంహెచ్ఓ డాక్టర్ చందు హెచ్ఈఓ ప్రతాప్
నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం డిఎంహెచ్ఓ డాక్టర్ చందు, హెచ్ఈఓ ప్రతాప్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపధ్యంలో వారు ఆసుపత్రిలోని రికార్డులు, ల్యాబ్, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రిలో ఓపీ ఎక్కువగా ఉన్నందున, ఫార్మసీకి సంబంధించిన వ్యాక్సిన్‌లు, డ్రగ్స్, వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ, టైఫాయిడ్ వ్యాధులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రవణ్ కుమార్, హోమియో వైద్యురాలు డాక్టర్ సంధ్య, ఎంఎల్‌హెచ్‌పీ మనోచిత్ర, కమ్యూనిటీ హెల్త్ సూపర్వైజర్ భాస్కర్, హెల్త్ సూపర్వైజర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
పిహెచ్సి ని ఆకస్మికంగా తనిఖీ
- Advertisement -
- Advertisement -