Sunday, July 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపెద్దవంగరలో ఇష్టారీతిన విద్యుత్ కోతలు

పెద్దవంగరలో ఇష్టారీతిన విద్యుత్ కోతలు

- Advertisement -

ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు వస్తుందో..
పెద్దవంగరలో కరెంట్ కోతలపై మండిపాటు 
విద్యుత్ శాఖ తీరుపై మండల వాసులు ఆగ్రహం 
నవతెలంగాణ – పెద్దవంగర
: మండలంలో విద్యుత్‌ కోతలతో జనం విలవిలలాడుతున్నారు. దీంతో విద్యుత్‌ కోతలు జఠిలంగా మారాయి. ఒక పక్క తీవ్ర ఉష్ణోగ్రతలు, మరో పక్క అప్రకటిత విద్యుత్‌ కోతలతో మండల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అప్రకటిత విద్యుత్‌ కోతలు రాత్రి సమయాల్లో కూడా విధించడం వల్ల జనం నిద్రకు దూరమవుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో అని మండల వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతుల పేరుతో ఇష్టారీతిన విద్యత్ కోతలు విధిస్తున్నారని విద్యుత్ అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్రకటిత విద్యుత్‌ కోతల అమలులో భాగంగా విద్యుత్‌ సరఫరాను గంట నుంచి రెండు గంటల పాటు నిలిపివేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. ఒక పక్క ఎండవేడిమి భరించలేక, మరో పక్క ఉక్కబోత భరించలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మండలంలో ఎటువంటి కోతలు లేకుండా నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -