నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి గురువారం రాత్రి పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో తిరిగి చీకట్లోనే ఓటును అభ్యర్థించారు. ఆ సమయంలో కరెంటు లేకపోవడంతో కారు చీకట్లోనే తిరిగారు.ప్రజా సమస్యలపై స్పందించే అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు అక్కడే ఉన్న ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ లో బ్లాక్ టీ తాగి అందర్నీ టీ తాపించి వామపక్ష అభ్యర్థులు గెలిపిస్తే ప్రజల పక్షాన ప్రజల సమస్యలపై దృష్టి సారించింది అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తారని విన్నవించారు.వామపక్షాల తరపున రంగంలో ఉన్న వారిని ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.ఆయన వెంట సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డబ్బికార్ మల్లేష్,వీరేపల్లి వెంకటేశ్వర్లు సర్పంచ్ మూడవత్ రవి నాయక్, సయ్యద్ తదితరులు ఉన్నారు.
కారు చీకట్లో ఎన్ఎస్పీ క్యాంప్ లో రంగన్న ప్రచారం
- Advertisement -
- Advertisement -



