నవతెలంగాణ – మిడ్జిల్
ఈనెల 31న మండలంలోని రాణి పేట గ్రామ పంచాయతీ తై బజార్ వేలం పాట గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన వ్యక్తులు రూ.20వేలు గ్రామపంచాయతీ పేరు మీద డిడి తీసి వేలంలో పాల్గొనాలని తెలిపారు. గతంలో వేలంలో పాల్గొని బకాయిలు ,ఇంటి పన్ను, లైసెన్స్ ఫీజుబకాయలు చెల్లించని వారు వేలంలో పాల్గొనుటకు అనర్హులని పేర్కొన్నారు. వేలం పొందిన వారి డిపాజిట్ మరియు రెండో పాట పాడిన వారి డిపాజిట్ ఉంచుకొని మిగతా వారి డిపాజిట్ తిరిగి ఇవ్వబడునని తెలిపారు. వేలంపాట దక్కించుకున్న వారు 50 శాతం వేలం పాడిన రోజే నగదు రూపంలో గ్రామ పంచాయతీకి చెల్లించాలని సూచించారు. మిగతా 50 శాతం నెలవారీగా చెల్లించే విధంగా వంద రూపాయల బాండ్ పేపరలో రాశి ఇవ్వాలని పేర్కొన్నారు.
ఈనెల 31న రాణిపేట సంత వేలం: కార్యదర్శి సుదర్శన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



