- Advertisement -
తొలి మ్యాచ్‌లో ఢిల్లీతో హైదరాబాద్ ఢీ
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ నేటి నుంచి ఆరంభం కానుంది. భారత క్రికెటర్లు సైతం సొంత రాష్ట్రాల జట్ల నుంచి బరిలోకి దిగుతున్న వేళ ఈసారి రంజీ ట్రోఫీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలైట్ గ్రూప్-డిలో ఉన్న హైదరాబాద్ తొలి మ్యాచ్‌లో బలమైన ఢిల్లీతో తలపడనుంది. తిలక్ వర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న హైదరాబాద్.. ఈ సీజన్‌లో క్వార్టర్‌ఫైనల్ బెర్త్ లక్ష్యంగా ఆడనుంది. రాహుల్ సింగ్, హిమతేజ, తనయ్ త్యాగరాజన్, సివి మిలింద్, శరణు నిశాంత్‌లు ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు కీలకం కానున్నారు. హైదరాబాద్, ఢిల్లీ మ్యాచ్ నేటి నుంచి హైదరాబాద్‌లో జరుగుతుంది.
- Advertisement -