Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు.. రాకపోకలు బంద్

ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు.. రాకపోకలు బంద్

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
మండలంలోని రావిరాల ఆలేరు వావిలాల లోవెల్ కాజ్ వేలలో వరద ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాకపోకలను బంధు నిర్వహించామని తహసిల్దార్ చందా నరేష్ ఎస్సై చిర్రా రమష్ బాబు ఎంపీడీవో కుమార్ తెలిపారు. బుధవారం ఉదృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల వద్దకు వెళ్లి పరిశీలించి తగు సూచనలు చేసే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయని అంతేకాకుండా ఆజ్ వేళలో వరద ఉధృతంగా ప్రవేశిస్తుండడంతో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించి రాకపోకలను బందు నిర్వహించామని అన్నారు. ఎం ఆర్ ఐ రామకృష్ణ జిపిఓ జనార్దన్ పంచాయతీ కార్యదర్శులు మణిదీప్ రాజేశ్వర్ సంబంధిత జీపీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -