Wednesday, August 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఫ్రాన్స్‌లో భారీ కార్చిర్చు..

ఫ్రాన్స్‌లో భారీ కార్చిర్చు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఫ్రాన్స్‌ లో భారీ కార్చిచ్చు సంభవించింది. మంగళవారం దక్షిణ ఫ్రాన్స్‌లోని అవుడే డిపార్ట్‌మెంట్‌ ప్రాంతంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ కార్చిచ్చులో ఇప్పటివరకు దాదాపు 12 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అడవి కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. అక్కడికి కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు సైతం భారీగా పొగ వ్యాపించిందని చెప్పారు.

మంటలను అదుపు చేయడానికి 1,800 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనికి వైమానిక దళాల సాయం కూడా తీసుకుంటున్నారు. గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో అధికారులు పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్చిర్చు ఇప్పటికే ఒకరిని బలితీసుకుంది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కార్చిచ్చుకు దగ్గరలో ఉన్న ఓ గ్రామం మొత్తాన్ని ఖాళీ చేయించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

కార్చిర్చు ప్రభావం ఎక్కువగా ఉండే సమీప ప్రాంతాల్లోని పలు గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కార్చిచ్చు కారణంగా చుట్టుపక్కల రహదారులను మూసివేయడంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -