ది న్యూఇండియన్ టైమ్స్ విజువల్ మీడియా (టీఎన్‌ఐటీ) రంగంలో తనదైన ముద్ర వేసుకుంది. సీఈఓ రఘు భట్ నేతత్వంలో ప్రతీ సంవత్సరం ‘టీఎన్‌ఐటీ’ మీడియా అవార్డ్స్‌ను అత్యంత ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మీడియా పట్ల ఉన్న ప్యాషన్‌తో మొదలైన ఈ అవార్డ్స్ వేడుక సక్సెస్ ఫుల్‌గా 8వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది.
ఈ సందర్భంగా సిఈవో రఘు బట్ మాట్లాడుతూ,’శుభలేఖ సుధాకర్, ఉత్తేజ్, మా తెలుగు జ్యూరీ ప్రభుకి హదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవార్డులను ప్రారంభించి ఇది ఎనిమిదవ సంవత్సరం. ఈ ఏడాది ఆగస్టు 23న బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నాం. మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ భాషల నుండి నామినేషన్లను స్వీకరిస్తున్నాం. ప్రతి మీడియా ఛానల్ మా టీంకు అప్లికేషన్లు సమర్పించమని కోరుతున్నాం’ అని అన్నారు.
‘రఘు విజన్‌తో సౌత్ ఇండియా మొత్తానికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రతి ఛానల్‌కు నామినేషన్ ఫామ్స్ పంపిస్తాం. వారు పూర్తి చేసి మాకు తిరిగి పంపాలి. తర్వాత జ్యూరీ పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తుంది. నటీనటులకు ఐఫా, సైమా లాంటి అవార్డ్స్ ఉన్నట్లే, మీడియాకి కూడా అంతే స్థాయిలో గుర్తింపు రావాలని మేము ఆశిస్తున్నాం. మీడియా రాత్రి పగలు కష్టపడుతూ సమాజానికి సమాచారం అందిస్తోంది. వారిని గుర్తించి గౌరవించడం గౌరవంగా భావిస్తున్నాం’ అని మార్కెటింగ్ హెడ్ ఖుషీ చెప్పారు.
జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ,’మీడియాలో ప్రతి విభాగానికి ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వాలన్న ఆలోచన చాలా ప్రత్యేకమైనది. అరుదైనది కూడా. ఈ కార్యక్రమానికి జ్యూరీగా వ్యవహరించడం ఒక బాధ్యత. నా అనుభవంతో, నిష్పక్షపాతంగా పని చేస్తాను. మీడియాకు అంకితంగా ఇస్తున్న ఈ అవార్డులు ఫిలింఫేర్ స్థాయిలో ఎదుగుతాయని నమ్మకంగా ఉంది’ అని తెలిపారు.
అరుదైన అవార్డులు
- Advertisement -
- Advertisement -