Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుశ్రీవందన ఆస్పత్రిలో అరుదైన వీఏబిసి డెలీవరి..

శ్రీవందన ఆస్పత్రిలో అరుదైన వీఏబిసి డెలీవరి..

- Advertisement -

నవతెలంగాణ – సిద్దిపేట అర్బన్
సిద్దిపేట పట్టణంలోని శ్రీవందన మెటర్నిటి, ఇన్ ఫెర్టిలిటీ ఆసుపత్రిలో అరుదైన వీఏబీసి డెలివరీ చేయడం జరిగిందని ఆస్పత్రి గైనకాలజిస్ట్ డాక్టర్.వందన బొజ్జ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వందన బొజ్జ మాట్లాడుతూ.. ఒకసారి మహిళకు మొదటి కాన్పు లో సిజేరియన్ అయిన తర్వాత దాదాపుగా రెండవ డెలివరీలో నార్మల్ కాదని ప్రజల్లో అపనమ్మకం ఉందని.. కానీ అలాంటి అనుమానాలను పటా పంచలు చేస్తూ నార్మల్ డెలివరీ చేసి నిరూపించడం జరిగిందని తెలిపారు.

ఈ నార్మల్ డెలివరీ విజయవంతంగా చేయబడి తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యురాలు వందన తెలిపారు. సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, మళ్లీ సిజేరియన్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో డాక్టర్ వందన వివరించారు. ప్రయివేటు ఆస్పత్రిలో అసలు నార్మల్ డెలివరీ చేయరనే అపవాదు ఉందని, కానీ శ్రీవందన ఆస్పత్రిలో ఒక నెలలో 7 నార్మల్ డెలివరీలు విజయవంతంగా చేయడం జరిగిందన్నారు. తమ ఆస్పత్రిలో అన్ని రకాల కాన్పులతో గర్భసంచి ఆపరేషన్ లు చేయబడునని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓటి అసిస్టెంట్ రమేష్, స్టాఫ్ మేనేజ్మెంట్ నాగరాజు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad