ఏడాదిలో ఒక్క టెస్టు ఆడనున్న అఫ్గాన్ స్పిన్నర్
న్యూఢిల్లీ : అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెడ్ బాల్ ఫార్మాట్‌కు దూరం కానున్నాడు. వెన్ను గాయానికి గురైన రషీద్ ఖాన్.. కెరీర్‌ను పొడిగించుకునేందుకు ఐదు రోజులకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఏడాదిలో ఒక్క టెస్టు మాత్రమే ఆడేందుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డుతో అంగీకారం కుదుర్చుకున్న రషీద్ ఖాన్.. చివరగా 2025 జనవరిలో జింబాబ్వేతో టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 55 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ‘జింబాబ్వేతో టెస్టులో నేను 55 ఓవర్లు బౌలింగ్ చేశాను. క్రికెట్‌కు దూరం కావాలని అనుకుంటే..రెడ్‌బాల్ ఫార్మాట్‌లో కొనసాగు అని వైద్యులు హెచ్చరించారు. వైద్యుల సూచన లెక్క చేయకుండా ఆ మ్యాచ్‌లో ఆడాను’ అని రషీద్ ఖాన్ అన్నాడు. ఈ ఏడాది జూన్ 6 నుంచి భారత్, అఫ్గనిస్తాన్ ఏకైక టెస్టు మ్యాచ్ చంఢగీడ్‌లో జరుగనుంది. ఈ ఏడాది రషీద్ ఖాన్ ఓ టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ.. ఐపీఎల్ పని ఒత్తిడి, తదితర కారణాలతో భారత్‌తో టెస్టుకు రషీద్ ఖాన్ దూరం కానున్నాడని సమాచారం. ఈ అంశంలో ఇప్పటికే అఫ్గాన్ క్రికెట్ బోర్డుకు రషీద్ ఖాన్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అఫ్గనిస్తాన్ తరఫున టీ20, వన్డేల్లో రషీద్ ఖాన్ రెగ్యులర్‌గా ఆడనున్నాడు. 2018లో టెస్టుల్లో అరంగ్రేటం చేసిన రషీద్ ఖాన్ ఆరు టెస్టుల్లో 20.44 సగటుతో 45 వికెట్లు పడగొట్టాడు.
భారత్‌తో టెస్టుకు రషీద్ దూరం!
- Advertisement -
- Advertisement -



