పీఎం కృషి సించాయ్ యోజన పనుల్లో అవినీతి ఆరోపణలు
డీఆర్డీఏలో ఇద్దరు అధికారుల అరెస్ట్
ఉన్నతాధికారుల పాత్రపైనా విచారణ జరపాలి
కింది స్థాయి సిబ్బంది రికార్డులు పరిశీలించిన ఏసీబీ అధికారులు
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని డీఆర్డీఏ కార్యాలయంలో అవినీతి వ్యవహారం వెలుగు చూసింది. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) 2.0 పథకం కింద చేపట్టిన పనుల్లో కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేయడంతో పాటు, ఇప్పటికే డబ్బులు చెల్లించినా మరింత మొత్తం కోసం వేధించినట్టు వచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ కేసులో టెక్ని కల్ అధికారి రాజు, ప్రాజెక్టు అధికారి సతీష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం డీఆర్డీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రికార్డులను పరి శీలించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య పేరుతో పత్రికా ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం.. పీఎంకేఎస్‌వై 2.0 పథకం కింద రేగొండ, మల్హర్రావు, పలిమెల మండలాల్లో భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా నీటి గుంతలు, సేద్యపు గుంతలు, ఊట గుంటలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం వంటి పనులు చేపట్టారు. రేగొండ మండలంలోని భాగీర్తిపేట, గూడేపల్లి, మడతపల్లి, నారాయణపూర్, దుంపిళ్లపల్లి, పొనగండ్ల గ్రామాల్లో పనులు చేపట్టారు. ఈ పనులను నలుగురు కాంట్రా క్టర్లు నిర్వహించగా, వారిలో ఒకరు అధికారు ల వేధింపులపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఫిర్యాదు మేరకు డీఆర్డీఏ కార్యాలయం లో రికార్డులను పరి శీలించడం తోపాటు సంబంధిత ఫోన్లలోని సమా చారాన్ని విశ్లేషించినట్టు వెల్లడించారు. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించిన ప్రతిసారీ డబ్బులు బదిలీ చేయాల ని సందేశాలు పంపినట్టు, ఖాతా వివరాలు అందించి నట్టు గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. కాంట్రాక్టర్ చేసిన సుమారు రూ.1.62 కోట్ల పనుల కు సంబంధించి రూ.39.14 లక్షలు బదిలీ అయి నట్టు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో నేరానికి సంబంధించిన ఆధారాలు లభించడంతో ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకున్నామ న్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కింది స్థాయి ఉద్యోగులు ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు లోనవుతున్నా రనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, డీఆర్డీఏ లో నిర్ణయాలు తీసుకునే ఉన్నతాధికారుల పాత్రపైనా సమగ్ర విచారణ జరగాలనే డిమాండ్ వ్యక్తమవు తోంది. అయితే, వీరి ప్రమేయంపై ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతా మని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు.







కామెంట్లు (0)