Magazines

మల్కాపురం ఐటీ పార్కులో ప్రమాదం

47 నిమిషాల క్రితం

Accident at Malkapuram
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

సిలిండర్ పేలి ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్

యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మల్కాపురం గ్రామంలోని ఐటీ పార్కులో ఉన్న ఆక్సి నౌ మెడికల్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ కంపెనీలో శుక్రవారం మధ్యాహ్న సమయంలో సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి సీఐ జి.మన్మదకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన మనీష్ కుమార్(21), మేకల నవీన్‌ మల్కాపురంలో నివాసముంటూ డైలీ లేబర్‌గా ఆక్సి నౌ మెడికల్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన మాథరి హరిప్రసాద్‌ కూడా అక్కడే పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో సిలిండర్‌‌లోకి ఆక్సిజన్‌ ‌నింపుతుండగా ఒక్కసారిగా పేలింది. దాంతో మనీష్‌కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. హరిప్రసాద్‌, మేకల నవీన్‌తోపాటు మరొకరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం, మృతదేహాన్ని చౌటుప్పల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్