Magazines

గఫూర్‌ పెద్ద కుమారుడు కిరణ్‌‌కు 
సీపీఐ(ఎం) నేతల ఘన నివాళి

1 గంట క్రితం

CPI(M) leader Kiran
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 2 నిమిషాల చదవడం

సంగినేనిపల్లిలో అంత్యక్రియలు..
కిరణ్‌ మృతి బాధాకరం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ,
వ్యవసాయ కార్మికసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్‌


నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) పార్టీ సీనియర్‌ ‌నేత ఏ గఫూర్, నిర్మలమ్మ దంపతుల కుమారుడు కిరణ్.. అమెరికాలోని కాలిఫోర్నియాలో సీనియర్‌ ‌డేటా సైంటిస్ట్‌‌గా ఉద్యోగం చేస్తూ చిన్నవయస్సులో చనిపోవడం బాధాకరమని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ అన్నారు. అమెరికాలో చనిపోయిన కిరణ్ భౌతికకాయం సోమవారం హైదరాబాద్‌‌కు చేరుకుంది. అక్కడినుంచి ఏపీలోని కర్నూల్‌‌కు తరలించారు. అంత్యక్రియలను మంగళవారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్లిలో నిర్వహించారు. అంతకుముందు ఆయన భౌతికకాయానికి సీపీఐ(ఎం), ప్రజా సంఘాల నేతలు పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సంతాప సభలో జాన్‌‌వెస్లీ, వెంకట్‌ మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన కిరణ్‌ గత నెల 30న గదిలో ఒంటరిగా విగత జీవిగా మారాడని, ఆ తర్వాత అమెరికా పోలీసులు బాడీని మార్చురీకి తరలించారని తెలిపారు.

చనిపోయిన 20 రోజుల వరకు కిరణ్ గురించి సమాచారాన్ని ఇవ్వడంలో అమెరికా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. పది, ఇంటర్ కర్నూల్‌లోనే చది‌విన కిరణ్‌.. ఇంటర్‌‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభా అవార్డు దక్కించుకున్నారని గుర్తు చేశారు. చెన్నై ఐఐటీలో చదివి, బెంగళూరు ఐఐటీలో లెక్చరర్‌‌గా పనిచేసి అమెరికాలో డాటా సైంటిస్ట్‌‌గా పని చేస్తున్నారని తెలిపారు. నెల రోజుల కిందటే గఫూర్ ఫోన్ చేయగా త్వరలోనే ఇండియాకు వస్తానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి కుటుంబానికి సంతోషమైన వార్త చెప్పారని అన్నారు. కిరణ్‌ అంత్యక్రియలకు ‌సీపీఐ(ఎం) కర్నూ‌ల్‌ జిల్లా మాజీ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌, ఏపీ నాయకులు గౌస్ దేశాయ్, తూముకుంట భాస్కర్ రెడ్డి, సీఐటీయూ సీనియర్‌ నాయకులు రాజారావు, సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, గద్వాల జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, మహబూబ్‌‌నగర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లె గోపాల్, నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసులు, వనపర్తి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జబ్బార్, నాయకులు నాగిరెడ్డి, సత్యనారాయణ గౌడ్, నర్సింహారెడ్డి, ఐద్వా జిల్లా కార్యదర్శి ఆత్మకూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నివాళులు అర్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్