Magazines

దసరా శుభాకాంక్షలు...

1 గంట క్రితం

Happy Dussehra
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 1 నిమిషాల చదవడం

రాష్ట్ర ప్రజలకు సీఎం సహా పలువురి అభినందనలు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు నేతలు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన గెలుపు, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక జరుపుకునే దసరా పండుగకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం ఉందని సీఎం తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మనకు ధైర్యం, ధర్మం, సత్యం, ఐకమత్యం, ఆత్మవిశ్వాసం వంటి గొప్ప విలువలను బోధిస్తుందని తెలిపారు. మనలోని అహంకారం, అసూయ, ద్వేషం, అన్యాయం వంటి చెడు లక్షణాలను తొలగించుకుని, ప్రేమ, కరుణ, సోదరభావం, మానవత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. దసరా పండుగ ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పలువురు నాయకులు కూడా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్