Magazines

ఎల్‌నినోను సమిష్టిగా ఎదుర్కొందాం

48 నిమిషాల క్రితం

El Niño togethe
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

రైతులు ప్రభుత్వ సూచ‌న‌లు పాటించాలి : స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్

నవతెలంగాణ-వికారాబాద్
భార‌త్‌‌తో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రకృతి విప‌త్తు ఎల్‌నినోను ప్ర‌జ‌లంద‌రం క‌లిసి ఎదుర్కొవాల‌ని స్పీకర్‌ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ సలహాలు, సూచనలు రైతులు పాటించాలని సూచించారు. వికారాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్యతో కలిసి లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎల్‌నినో విప‌త్తు, దాని ప్ర‌భావంపై స్పీక‌ర్ మాట్లాడారు. ఎల్‌నినో ప్ర‌భావం దాదాపు 100 దేశాల్లో ఉందని, ఇదొక ప్రకృతి విపత్తు అని అన్నారు. ప్రజలు, రైతులు ప్ర‌జా ప్ర‌భుత్వం, వ్య‌వ‌సాయ శాఖ అధికారుల స‌ల‌హాలు, సూచ‌న‌లు పాటిస్తూ ముందుకెళ్లాల‌ని కోరారు. రైతుల‌కు ప్రభుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుందని హామీ ఇచ్చారు. సాగుకు నీటిని పొదుపుగా వినియోగించుకుందామ‌న్నారు. ఎల్‌నినోను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు అండగా నిలబడాల‌ని పిలుపునిచ్చారు. నిరుపేదల ఆడబిడ్డల పెండ్లిలకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతోనే మొత్తం 97 మంది లబ్దిదారులకు (97 లక్షల 11 వేల 252 రూపాయలు) చెక్కులు అందజేసినట్టు చెప్పారు. వికారాబాద్ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు వికారాబాద్ ప‌ట్ట‌ణం త‌మ హ‌యంలో వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని, ట్యాంక్ బండ్ త‌ర‌హాలో వికారాబాద్ టౌన్‌‌లో శివసాగర్ చెరువును సుంద‌రీక‌ర‌ణ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా తాను ప‌రిష్క‌రిస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు. మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ గ‌డ్డం అన‌న్య మాట్లాడుతూ.. ప్ర‌జా ప్ర‌భుత్వంలో వికారాబాద్ ప‌ట్ట‌ణం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని అన్నారు. అన్ని వార్డుల్లోనూ రోడ్లు, డ్రయినేజీ నిర్మాణ ప‌నులు శ‌ర‌వేగంగా పూర్తికావొస్తున్నాయ‌ని, త్వ‌ర‌లోనే అన్ని ప‌నులు కూడా పూర్త‌వుతాయ‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మెన్‌ అర్థ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్