ఉత్తర్వులు జారీ చేసిన యాజమాన్యం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి అధికారులకు రాష్ర్ట ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. కోల్‌ఇండియా తరహాలో వేతనాలను పెంచింది. ఈ మేరకు సింగరేణి పర్సనల్ డైరెక్టర్ గౌతమ్ పోట్రు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 1 నుంచి7 వరకు దాదాపు1,800 మందికి ప్రయోజనం కలగనుంది. సెప్టెంబర్ 25 నుంచి ఆర్థిక ప్రయోజనాలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సవరించిన బేసిక్ వేతనాలు 2017 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఆర్థిక ప్రయోజనాలు మాత్రం సింగరేణి బోర్డు ఆమోదం తెలిపిన ఈ ఏడాది సెప్టెంబర్ 25 నుంచి వర్తిస్తాయి. పెరిగిన వేతనాలను అక్టోబరు నెల జీతాల నుంచి చెల్లించనున్నారు.
కొత్త వేతనాల ప్రకారం అధికారుల బేసిక్ వేతనాలు..
క్యాడర్ | పాత బేసిక్ | కొత్త బేసిక్ వేతనం |
ఈ-1 | రూ.40,000 | రూ.60,000 |
ఈ-2 | రూ.50,000 | రూ.70,000 |
ఈ-3 | రూ.60,000 | రూ.80,000 |
ఈ-4 | రూ.70,000 | రూ.90,000 |
ఈ-5 | రూ.80,000 | 1,00,000 |
ఈ-6 | రూ.90,000 | రూ.1,20,000 |
ఈ-7 | రూ.1,00,000 |






కామెంట్‌లు (0)