జిల్లా ఎన్నికల అధికారులకు సీఈఓ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ‘సర్’ ప్రక్రియలో తప్పుడు సమాచారమిస్తే కఠిన చర్యలు తీసుకోవాల ని రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన సోమవారం సర్య్కూలర్ జారీ చేశారు. రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో సర్ ప్రక్రియకు సంబంధించి కొంతమంది వ్యక్తులు పెద్ద ఎత్తున దరఖాస్తులు దాఖలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముషీరాబాద్, బహదూర్ పుర నియోజకవర్గంలోని ప్రీ ప్రింటెడ్ దరఖాస్తులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన నేపథ్యంలో ఓ వర్గం ఓట్లు టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోగస్ ఫారం-7 లపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. సర్ ప్రక్రియపై ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం ముందస్తు విచారణ జరిపిన తర్వాతే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రాతినిధ్య చట్టం నిబంధనల ప్రకారం తప్పుడు సమాచారం ఇవ్వడం నేరమనీ, అటువంటి వారిపై కూడా కఠినంగా వ్యవహరించాలని డీఈఓలను ఎన్నికల సంఘం ఆదేశించింది.







కామెంట్‌లు (0)