Magazines

భారత్-జపాన్ స్నేహ బంధం దీర్ఘకాలికం

52 నిమిషాల క్రితం

The India-Japan friendship is long-standing.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

సైబర్ గార్డెన్స్ లో ఘనంగా జపాన్ ఫెస్టివల్ -2026

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

భారతదేశం, జపాన్ దేశాల మధ్య ఎన్నో ఏండ్ల నుంచి స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ ‌తెలిపారు. రెండు దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, ఆర్థిక సహకారం ఆధారంగా దీర్ఘకాలిక స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నాయని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని సైబర్ గార్డెన్స్ లో జపాన్ ఫెస్టివల్-2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శ‌క్తి, గ‌నుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామితో కలిసి స్పీకర్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికత, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, విద్య, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాల్లో భారత్, జపాన్ మధ్య సంబంధాలు మరింత అభివృద్ధి చెందాయన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, పారిశ్రామిక అభివృద్ధి రంగాల్లో ముందు వరుసలో ఉందని చెప్పారు. పెట్టుబడులు, ఆధునిక తయారీ, సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో హిరోషిమా ప్రిఫెక్చర్ తో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు. హిరోషిమా శాంతికి, స్థిరత్వానికి, మానవ సంకల్పానికి ప్రతీకగా గౌరవించబడుతోందన్నారు. భారత్-జపాన్ దేశాల మధ్య ఉన్న స్నేహ బంధాన్ని మనం గొప్పగా భావిస్తున్నామని పేర్కొన్నారు. మరింత సహకారం, ప్రజల మధ్య సంబంధాలతో భార‌త్, జ‌పాన్ మ‌ధ్య‌ బంధాలను ఇంకా బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్