Friday, February 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాల్యవివాహాల నిర్మూలన రథయాత్రకు శ్రీకారం

బాల్యవివాహాల నిర్మూలన రథయాత్రకు శ్రీకారం

- Advertisement -

– ప్రజల్లో అవగాహన కార్యక్రమం ప్రారంభం
నవతెలంగాణ – కాటారం

ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంతో పాటు బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు జస్ట్ రైడ్స్ ఫర్ చిల్డ్రన్ సహాయ ఎన్‌జీవో ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలన రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాల ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ఎ. సూర్యనారాయణ మాట్లాడుతూ.. బాల్యవివాహాలు బాలికల భవిష్యత్తును నాశనం చేసే సామాజిక దుష్ప్రభావమని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బాల్యవివాహాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక నష్టాలను ప్రజలకు వివరించి, చట్టపరమైన చర్యలపై అవగాహన కల్పించేందుకు ఈ రథయాత్ర చేపట్టినట్లు తెలిపారు.

గ్రామాల్లో ప్రజలను మేల్కొలిపే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ అవగాహన కార్యక్రమంలో బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలికల విద్య, భద్రత, భవిష్యత్తు పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై జి. తమాషా రెడ్డి (కాలేశ్వరం), సీఐ ఎన్. వెంకటేశ్వర్లు (మహదేవ్పూర్), స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నరేష్, అలాగే కాటారం సోషల్ మోబిలైజర్లు సామల శ్రీలత, గుర్రం ప్రభులత తదితరులు పాల్గొన్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని, ఏదైనా ఘటనలు తెలిసిన వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -