రూ.1000 నుండి రూ.5000 వరకు డిమాండ్
నవతెలంగాణ – రామారెడ్డి
పేద ప్రజలకు రేషన్ కార్డులు అందించడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తుంది. ఇది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ప్రకటించింది. ఐన క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చెబుతున్న దానికి, అధికారులు చేస్తున్న దానికి పొంతన లేకుండా పోయింది. కాసులు అందుతేగాని కార్డు మంజూరు గాని పరిస్థితి. ఒక్కొక్కరి దగ్గర నుండి రూ.1000 నుండి రూ.5000 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి అర్హులైన పేద ప్రజలకు నిస్వార్ధంగా రేషన్ కార్డులు అందించాలని ప్రజలు కోరుతున్నారు. సంఘటనపై కామారెడ్డి ఆర్డీవో వీణ ను నవతెలంగాణ వివరణ కోరగా.. విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అంగట్లో రేషన్ కార్డులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES