- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐదు నెలల కమీషన్ డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర డీలర్ల సంక్షేమ సంఘం ఈనెల 5న బంద్ కు పిలుపునిచ్చింది. గత ఐదు నెలలుగా డీలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం గౌరవ వేతనం రూ.5 వేలు, కమీషన్ రూ.300 పెంచాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -