Saturday, February 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాతే రేషనలైజేషన్‌ను చేపట్టాలి

ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాతే రేషనలైజేషన్‌ను చేపట్టాలి

- Advertisement -

– టీఆర్టీఎఫ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

జీవో 25ను సవరించి, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాతే రేషనలైజేషన్‌ను చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీఆర్టీఎఫ్‌) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఫెడరేషన్‌ అధ్యక్షులు కటకం రమేశ్‌, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి పాఠశాల విద్యా సంచాలకులు నవీన్‌ నికోలస్‌కు వినతిపత్రం సమర్పించారు. 2,325 ఎస్జీటీ పోస్టులను రద్దు చేసే ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు కోరారు. జీవో 25 సవరణపై ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేవలం విద్యార్థుల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకోకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుని చొప్పున కనీసం ఐదుగురు ఉపాధ్యాయులుండేలా చూడాలన్నారు. అదనపు సెక్షన్లు పెరిగినప్పుడు సబ్జెక్టుల ఉపాధ్యాయులను ఒకేసారి కేటాయించాలని వారు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -