– రేవంత్ రెడ్డి సర్కారు చేసిన హత్య : మాజీ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రైతు రవినాయక్ మరణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో వ్యవసాయం పూర్తిగా కుప్పకూలిపోయిందనే విషాదాన్ని మరోసారి ఈ రైతు దుర్మరణం రుజువు చేసిందని తెలిపారు. అప్పుల బాధతో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఈర్లపల్లిలో రవి నాయక్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ ఆస్పత్రులు చూపిన నిర్లక్ష్య వైఖరి రైతు మరణానికి కారణం అయిందని ఆరోపించారు. రైతుల ఆవేదనను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో కూడా విఫలమైందని మండిపడ్డారు. ఇది కేవలం ఆస్పత్రుల నిర్లక్ష్యమే కాదనీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని పేర్కొన్నారు. రైతులను నిరాశలోకి నెట్టి, ఇటు జీవితంలో అటు మరణంలోనూ వారికి గౌరవం లేకుండా చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించారు.
రవినాయక్ దుర్మరణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES